నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకమర్రి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురిలో.. ఇద్దరు యువకులు ఈత కొట్టేందుకు కాలువలోకి దిగారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా.. కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు ఓ యువకుడిని కాపాడారు.
రవి శంకర్ అనే మరో వ్యక్తి నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. ముగ్గురు యువకులు కడప జిల్లా బద్వేలుకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇవీ చూడండి: