ETV Bharat / state

నీళ్లు లేక పొలాలు బీళ్లు.. బోసిపోతున్న పల్లెలు - no water

నెల్లూరు జిల్లాలో కరవు తాండవం చేస్తోంది. వర్షాభావంతో పల్లెలు బోసిపోతున్నాయి. వ్యవసాయం లేక రైతులు ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. గడ్డి లేక పశువులను తెగనమ్ముకుంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అట్టడుగుకి పడిపోయి..తాగేందుకు నీరు దొరకని పరిస్థితినెలకొంది.

no-water-in-villages
author img

By

Published : Jul 22, 2019, 1:11 PM IST

నీళ్లు లేక పోలాలు బీళ్లు... బోసిపోతున్న పల్లెలు...

నెల్లూరు జిల్లాలో రైతుల బతుకు భారంగా మారింది. మూడేళ్లుగా సరైన వర్షాల్లేక పొలాలు బీళ్లుగా మారాయి. అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు పడని దుస్థితి నెలకొంది. ఉదయగిరి, కలిగిరి, వింజమూరు ప్రాంతాల్లో.... అన్నదాతల పరిస్థితి మరీ దయనీయం. పశువులకు నీరు, గ్రాసం దొరక్క తెగనమ్ముకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వరిగడ్డి తెద్దామన్నా... దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరవుతో జిల్లాలో రెండొంతులకుపైగా సాగు తగ్గింది. దీనివల్ల ఎండుగడ్డి కొరత ఏర్పడింది. కొంతమంది మూగజీవాలను దూరప్రాంతాలకు తోలుకుపోతుండగా... మరికొందరు అమ్మేస్తున్నారు. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గి... తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వర్షాభావంతో వ్యవసాయం లేక ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాల్లోని కొందరు రైతులు ఊళ్లు వదిలి వలసపోతున్నారు. కూలీలు సైతం పనులు దొరక్క తిండికి ఇబ్బందిపడుతున్నారు.

ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజవర్గాల్లోని గ్రామాలకు.. సోమశిల నీరు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాలువలను త్వరగా పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య కొంత తీరుతుందని అంటున్నారు.

Intro:AP_RJY_86_22_BC_ sagham_PC_AVB_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.

( ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పైన అవుతుందని ఏలూరు లో బీసీ గర్జన సభలో ఇచ్చిన హామీలు కన్నా ఎక్కువే చేసారని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం నాయకులు గూడురివెంకటేశ్వర్రావు అన్నారు. రాజమహేంద్రవరం లో వెంకటేశ్వరవు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ లకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని ఎనో పోరాటాలు చేశామని అన్నారు.
విజయసాయిరెడ్డి 2018లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని 2019లో ఆ బిల్లుపై చర్చ రావడం జరిగిందని రాజకీయ పార్టీలు ఆ బిల్లు అన్ని పార్టీల మద్దతు ఇచ్చారని అని ఒక్క బిజెపి ఇవ్వలేదని వెంకటేశ్వరరావు అన్నారు.

byte

జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు --- వెంకటేశ్వర్రావు

Body:AP_RJY_86_22_BC_ sagham_PC_AVB_AP10023

Conclusion:AP_RJY_86_22_BC_ sagham_PC_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.