విజయవాడ తరువాత రెండో పెద్ద ఆటోనగర్ గా నెల్లూరుకు పేరుంది. 100ఎకరాల విస్తీర్ణంలో 1984లో ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు ఆటోనగర్ లో చిన్నపరిశ్రమలను ఏర్పాటుచేశారు. సుమారు15వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఆరువేలకు పైగా చిన్నపరిశ్రమలు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 35ఏళ్ల కిందట ఏ విధంగా ఏర్పాటు అయ్యిందో నేటికి అదే విధంగా ఉంది. రోడ్లు గుంతలు. చిన్న వర్షం వస్తే తటాకాలను తలపిస్తాయి. ఆక్కడి సమస్యలను మా ప్రతినిది రాజారావు వివరిస్తారు.
ఇదీ చదవండి: అది నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు కట్టే ఉరితాళ్లు: చంద్రబాబు