అనవసరంగా రోడ్లపై తిరిగితే క్వారంటైన్‌కు తరలిస్తామని నెల్లూరు రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. లాక్డౌన్ రెండో దశ ముగుస్తున్న సమయంలోనూ కరోనా కేసులు పెరగడం వల్ల కఠినంగా వ్యవహరించక తప్పడం లేదని ఆర్టీఓ హుస్సేన్ సాహెబ్, నగర్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. చిన్న చిన్న కారణాలతో ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి, కేసు నమోదు చేయడం సహా క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులు నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, నిర్దేశించిన సమయంలో.. ఒకరు మాత్రమే వెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇవీ చూడండి...