ETV Bharat / state

'అవసరాలకు తగ్గట్టుగా బస్సు సర్వీసులు పెంచుతాం' - latest news of bus services in nellore dst

ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభించిన ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉందని నెల్లూరు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకట శేషయ్య తెలిపారు. అయినప్పటకీ బస్సులను నడిపిస్తామని తెలిపారు.

nellore dst bus services  will be extend  according to  people  needs

author img

By

Published : May 23, 2020, 11:00 PM IST

ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు క్రమంగా ఆర్టీసీ సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని... నెల్లూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకట శేషయ్య తెలిపారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నా..., బస్సులు యాథావిధిగా తిప్పుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని డిపోల నుంచి 120 బస్సులు నడుపుతున్నామని, విజయవాడ, తిరుపతి, కడప తోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు, ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.