ETV Bharat / state

ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.. పురపాలక సమావేశం అర్ధంతరంగా ముగిసింది.. - వెంకటగిరి పురపాల సంఘం

వెంకటగిరి పురపాలక సాధారణ సమావేశంలో అందరూ అధికార పార్టీ సభ్యులే. అయినా.. వారిలో పలువురు వివిధ సమస్యలపై గొంతెత్తారు. ప్రతి పనికీ చేసే ఖర్చులని బహిరంగం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టర్​ను 14వ వార్డ్ కౌన్సిలర్​ శంకరయ్య అడగడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు.

వెంకటగిరి పురపాలక సమావేశం
వెంకటగిరి పురపాలక సమావేశం
author img

By

Published : Oct 30, 2021, 8:18 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలిక సాధారణ సమావేశం మొదలైన క్షణాల్లోనే ముగిసింది. అధికార పార్టీ కౌన్సిలర్లే పురపాలిక అభివృద్ధి గురించి నిలదీయడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ఈ రకంగా పాలక సభ్యులు మాట్లాడితే మంచిది కాదని, సమావేశాన్ని ముగించాలని అన్నారు. దాంతో వెంకటగిరి పురపాలిక ఛైర్​పర్సన్​​​ భానుప్రియ సమావేశాన్ని ముగించారు.

వెంకటగిరి పురపాలక సాధారణ సమావేశంలో అందరూ అధికార పార్టీ సభ్యులే అయినా వారిలో పలువురు వివిధ అంశాలపై నిలదీశారు. మూడు నెలలుగా పుర పాలక సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదని వెంకటగిరి పురపాలక మాజీ ఛైర్​పర్సన్​, ప్రస్తుత కౌన్సెలర్​ శారద అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు సరిగా లేవని కౌన్సిలర్​ ఢిల్లీబాబు నిలదీశారు. ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్​ మీదుగా వచ్చేలా చూడాలని కోరారు.

ప్రతి పనికీ చేసే ఖర్చులని బహిరంగం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టర్​ను 14వ వార్డ్ కౌన్సిలర్​ శంకరయ్య అడగడంతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. మున్సిపాలిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేకపోయినా ఈ రకంగా సభ్యులు నిలదీయడం ఏమిటని ఎమ్మెల్యే మండిపడ్డారు. సభకు ముగింపు చెప్పాలని ఆయన పేర్కొనడంతో ఛైర్ పర్సన్​ భానుప్రియ ముగించారు. ఈ దశలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మరో సభ్యురాలు వాహిదా విఫలయత్నం చేశారు. ఈ రకంగా పాలక సభ్యులు మాట్లాడితే మంచిది కాదంటూ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

ఇదీ చదవండి: KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.