ETV Bharat / state

రొయ్య రైతుకు... కరెంటు కష్టం - విద్యుత్ సరఫరా ఆటంకం వల్ల రొయ్యరైతుకు నష్టాలు

కరోనా లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆక్వా రైతులను...విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. నాసిరకం విద్యుత్తు తీగలతో సరఫరా ఎప్పుడు ఉంటుందో లేదో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఆటంకాల వల్ల రొయ్యల ఎదుగుదలపై ప్రభావం పడుతోందని రైతులు అంటున్నారు. ఒక నెల విద్యుత్ బిల్లు కట్టకుంటే సరఫరా నిలిపివేసే అధికారులు.. సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రొయ్య రైతుకు...కరెంటు కష్టం
రొయ్య రైతుకు...కరెంటు కష్టం
author img

By

Published : Oct 11, 2020, 6:42 PM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నగారి పాలెం సబ్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం, ఒట్టూరు సమీపంలోని పాతూరు వరకు 11 కేవీ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఈ విద్యుత్ తీగలు వేసి ఏళ్లు గడుస్తుండం వల్ల కొద్దిపాటి గాలి వీచిన తెగిపడుతున్నాయి. ఈ సమస్యతో... సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలతో పాటు, ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రతిసారి జనరేటర్​పై ఆధారపడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల రొయ్యల ఎదుగుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. రొయ్యలు ఎదుగుదల లేక నష్టపోతామని ఆక్వా రైతులు చెబుతున్నారు.

చిన్న గాలి వచ్చిన కరెంట్​ లైన్ కట్ అయిపోతుంది. ఒక ట్రాన్స్​ఫార్మర్​కి నాలుగు గంటలు కరెంట్ నిలిచిపోవడం, ఆ సమయంలో మేము జనరేటర్లు వాడాల్సివస్తోంది. డీజిల్ ఖర్చు సుమారు గంటకి వెయ్యి రూపాయలు వస్తుంది. అందరు రైతులదీ ఇదే పరిస్థితి. వారానికి నాలుగైదు సార్లు లైన్లు తెగిపోతున్నాయి. తెగిన కరెంట్ తీగలు తొక్కి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ---శివ,ఆక్వా రైతు

ఏరియేటర్లే రొయ్యలకు ఆధారం

ఒక ఎకరా రొయ్యల సాగుకు సుమారు 12 నుంచి 14 లక్షలు ఖర్చవుతుంది. ఒక క్రాప్ 90 రోజుల నుంచి 120 రోజుల వరకు పడుతుంది. విద్యుత్ లేకపోవడంతో రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల 24 గంటల్లో పగలు మేత వేసే సమయంలో రెండు గంటలు మాత్రమే ఏరియేటర్లు ఆపుతారు. మిగిలిన అన్ని వేళల్లో తప్పనిసరిగా రొయ్యలకు ఆక్సిజన్ అందుతూ వుండాలి. విద్యుత్ సరఫరా లేక ఏరియేటర్లు తరచూ నిలిచిపోవడం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.

మా దగ్గర అంటే ఏడీఈ, ఏఈ, డీఈల వద్దకు ఈ సమస్య రాలేదు. వచ్చిన వాటిని అన్నింటినీ పరిష్కరించాం. ఏదైనా సమస్య ఉంటే కండెక్టర్లకు ఎస్టిమేషన్ వేసి, మారుస్తాం. వారికి ఎవరు చెప్పారో గాని కొంత మెటీరియల్ కొన్నారు. మా దగ్గరకు వచ్చి లైన్​ మార్చమని అడిగారు. మా దగ్గరకు వస్తే ఎస్టిమేషన్ ఇచ్చి, అన్నింటినీ ఏర్పాటుచేస్తాం. ఆ ప్రాంతంలో ఇటీవలె 26 కేవీ లైన్లు మార్చాం. ---భాస్కర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ, కావలి

సొంతంగా ఏర్పాటుకు ప్రయత్నం

ఈ ప్రాంతంలో 150 మంది 800 ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తున్నారు. విద్యుత్ సరఫరా సమస్యతో రైతులు అదనపు ఖర్చుతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఒట్టురు సమీపంలోని శ్రీలంక గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు విద్యుత్ తీగలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ పనులకు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు విద్యుత్ తీగలను మార్చేందుకు వచ్చినా...వారిని విద్యుత్ శాఖ అధికారులు ఆపేశారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సమస్యలు లేకుండా పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 5,210 కరోనా కేసులు, 30 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.