నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటీయూ ఆధ్వర్యంలో వర్షంలోనూ ర్యాలీ చేశారు. పని వారాలు తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ కష్టాన్ని గుర్తించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. 3, 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. జీతాలు ఇవ్వకపోతే ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి..