సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణంలో మర్రిపాడు మండలంలోని భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది .ఈ తరుణంలో మండల పరిధిలోని పడమటినాయుడుపల్లి,ఇర్లపాడు రెవెన్యూ పరిధిలో కొంతమంది గుత్తేదారులకు గుట్టు చప్పుడు కాకుండా 133 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడంగల్లో నమోదు చేశారు .అంతేకాక 1.14 ఎకరాల్లో ఉప్పుటేరు వాగును అడంగల్లో ఎక్కించారు .
దీంతో గ్రామంలోని కొంతమంది నాయకులు అప్పట్లో అధికారులకు తెలియజేశారు . అప్పటికే తహశీల్దారు కృష్ణారావు మర్రిపాడు నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు . మర్రిపాడులో పనిచేస్తున్న ఆయన వింజమూరులో నివాసం ఉంటూ సొంత ఇంటికి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి లావాదేవీలు జరిపించినట్టు సమాచారం . ఆ కాల వ్యవధిలో పనిచేస్తున్న ఆర్ ఐ రవికుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు . మిగతా వాటిపైనా విచారణ జరిపిస్తే మరిన్ని భూ భాగోతాలు వెలుగులో కొస్తాయని మండల ప్రజలు తెలుపుతున్నారు .
ఇదీ చదవండి