ETV Bharat / state

పిల్లలతో పాటు నిప్పంటించుకున్న తల్లి.. ఇద్దరు మృతి, కుమారుడు క్షేమం - nellorepalem latest news

ఏం కష్టం వచ్చిందో ఆ తల్లికి.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. నవమాసాలు మోసి, కన్నపిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్లాలనుకుంది. తాను పోయాక పిల్లలను ఆదరించేవారు లేక కష్టపడతారనుకుందేమో..? పిల్లలతో పాటు తల్లి బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సమీపంలో చోటు చేసుకుంది.

mother committed suicide with her two children
కాలిపోయిన మృతదేహాలు
author img

By

Published : Apr 23, 2021, 9:10 AM IST

Updated : Apr 23, 2021, 9:11 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సెంటర్​లో విషాదం జరిగింది. కర్ణాటకలోని బళ్లారికి చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లి సుబ్బులు(27), కుమార్తె మధురవాణి (5) మృతి చెందారు. నిప్పు చూసి భయంతో పారిపోయి వచ్చిన కుమారుడు మహేశ్​ ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతనికి గాయాలయ్యాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఐసీయూలో మంటలు- 13 మంది రోగులు మృతి

Last Updated : Apr 23, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.