ETV Bharat / state

మా ప్రభుత్వం, మా నిధులు.. అడగడానికి మీరెవరు? : వైకాపా ఎమ్మెల్యే - నల్లపురెడ్డి కామెంట్స్

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీలో ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారో చెప్పాలంటూ ఇటీవల తెదేపా నేతలు ఆందోళన చేయగా.. ఆ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే.. "ప్రభుత్వం మాది, నిధులు మావి, ఎక్కడికి కావాలంటే అక్కడికి రోడ్లు వేసుకుంటాం. అడిగేందుకు మీరెవరు?" అంటూ వారిపై విరుచుకుపడ్డారు.

ఎక్కైడికైనా రోడ్లేసుకుంటాం..అడగడానికి మీరెవరూ ?'

author img

By

Published : Feb 27, 2022, 8:48 PM IST

'మా ప్రభుత్వం, మా నిధులు..ఎక్కైడికైనా రోడ్లేసుకుంటాం..అడగడానికి మీరెవరూ ?'

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. తెదేపా నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ప్రభుత్వం మాది, నిధులు మావి, ఎక్కడికి కావాలంటే అక్కడికి రోడ్లు వేసుకుంటాం. అడిగేందుకు మీరెవరు?" అంటూ విరుచుకుపడ్డారు.

బుచ్చిరెడ్డిపాలెంలో 18 మంది వైకాపా కౌన్సిలర్లు గెలిచారని..,తమ నిధులతో ఎక్కడికైనా రోడ్లు వేసుకుంటాం అడిగేందుకు మీరెవరంటూ తెదేపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీకి రోడ్లు వేస్తుంటే రియల్ ఎస్టేట్ కోసమే వేస్తున్నారంటూ తెదేపా నేతలు వ్యాఖ్యనించటం సరికాదన్నారు. తమ ప్రభుత్వంలో అవసరమైతే.. లే-అవుట్లకు, కౌన్సిలర్ ఇళ్లకు రోడ్లు వేస్తామని, అడిగితే తెదేపా నాయకుల ఇళ్లకు సైతం రోడ్లు వేయిస్తామన్నారు.

ఇదీ చదవండి

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.