నెల్లూరులోని నారాయణ కొవిడ్ ఆస్పత్రిని మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి పరిశీలించారు. బాధితులకు అందుతున్న వైద్యసేవలపై అధికారులు, వైద్యులతో చర్చించారు. ఆస్పత్రిలో పడకల వివరాలు, ఆక్సిజన్ నిల్వలు, ఆరోగ్యశ్రీ ఉన్న వారికి, లేనివారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయని మంత్రులు అన్నారు. అవసరం మేరకే రుసుము ఉండేలా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరల విషయంలో తారతమ్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధరబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే