Agriculture Minister Kakani Govardhan Reddy: చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. అధికారుల చుట్టూ తిరగకుండా చుక్కల భూమిని రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన నెల్లూరులో తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా చుక్కల భూమితో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ముఖ్యమంత్రి నిర్ణయంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చుక్కల భూముల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అభ్యంతరాలు లేని చుక్కల భూములను రెగ్యులర్ చేయనున్నట్లు మంత్రి కాకాణి తెలిపారు. మొత్తం భూములను ఒకే విడతలో ఇస్తామని చెప్పారు.నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా చుక్కల భూములు ఉన్నాయన్నారు. జిల్లాలో దాదాపు 43 వేల ఎకరాల భూములు రెగ్యులర్ కానున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే నెల్లూరు జిల్లాలో పర్యటించి, రైతులకు పట్టాలు అందజేస్తారని చెప్పారు.
అసలు ఏంటీ చుక్కల భూములు: చుక్కల భూములు అంటే.. బ్రిటిష్ వారి సమయంలో సర్వే చేసినప్పుడు.. ఎవరైనా సరే ఈ భూమి ఎవరిదీ అని అంటే.. మా అధీనంలో లేదు అని చెప్పినా, అధీనంలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయినా లేదా ఆ భూమిని ఎవరూ సాగు చేయకపోయినా.. ఆ భూమికి యజమాని పేరు నింపకుండా చుక్కలు పెట్టారు. దానినే చుక్కల భూమి అంటారు. 'డాటెడ్ ల్యాండ్స్' అని పిలుస్తారు.
"జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులకు సంబంధించి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సంబంధించి చుక్కల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టా భూములుగా మార్చేసి.. అడంగులు, 1బీ ఇచ్చేయండి అని చెప్పి.. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత దానికి సంబంధించి అభ్యంతరకరమైన వాటిని పక్కన పెట్టండి.. మిగతా విటిని ఒకే విడతలో మొత్తం ఇచ్చేయండి.. రైతులకు చుక్కల భూముల సమస్య పరిష్కరించండి అని చెప్పారు. అతి ఎక్కువ భూములు ఉన్న జిల్లాలో.. నెల్లూరు జిల్లా ఉంది. త్వరలోనే నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగానే.. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నడిపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను". - కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.
ఇవీ చదవండి: