నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ పర్యటించారు. 44వ డివిజన్ వీఆర్సీ కూడలి నుంచి పలు ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. రోడ్లు, పారిశుద్ధ్యం, మురుగుకాలువల నిర్మాణాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కొళాయిల నిర్వహణ, మంచి నీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు వారం, పదిరోజుల్లో పూర్తి చేయిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: మరిన్ని పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచన..!