ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి చుట్టం చూపుగా వస్తూ జూమ్ టీవీకే పరిమితమై పోతున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైకాపా చేరికల్లో మంత్రి పాల్గొన్నారు. తెదేపా సీనియర్ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు వైకాపాలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గోవర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ నేరవేరుస్తూ, దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ పేరు గడిస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెదేపా నాయకులు వైకాపాలో చేరుతున్నారన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, కడప తర్వాత కోవూరు నియోజకవర్గమే వైకాపాకు కంచుకోటగా మారుతోందన్నారు. జనవరి నెలాఖరుకు నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం చేతులుమీదుగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: