నాడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా.. అధికారంలోకి వచ్చాక వర్గీకరణ చేపట్టకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ(MMRPS founder Manda Krishna Madiga) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు.. వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినా పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద మీడియాతో మాట్లాడారు.
హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత తిరుపతిలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చించాలని డిమాండ్ చేశారు. షెడ్యూలు కులాల అభివృద్ధి కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు(Manda Krishna Madiga on SC Classification Bill) పెట్టాలన్నారు. జాప్యం చేయడానికి నిరసనగా డిసెంబర్ 14న చలో దిల్లీ చేపట్టనున్నట్లు మందా కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి..