ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం జగన్ మాటలు గాలిమాటలే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు.
రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టి ధాన్యానికి రూ. 8వేలు ధర కూడా లభించడం లేదన్నారు. పుట్టి ధాన్యానికి 16వేల రూపాయల కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'హలో.. బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? కోవిడ్ కిట్లు అందాయా?'