నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ దినేష్‌కుమార్‌ను డివిజన్ ఇన్‌ఛార్జీలతో పాటు.. ఎమ్మెల్యే కలిశారు. అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలపై కమిషనర్‌తో చర్చించి, డివిజన్ల వారీగా వినతిపత్రాలు అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, కార్పొరేషన్ జనరల్ ఫండ్స్‌ను వినియోగించి దాదాపు రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు శ్రీధర్‌రెడ్డి చెప్పారు. వారం రోజుల్లో టెండర్లను పిలిచి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైఎస్సార్ నగర్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
'నెల్లూరు రూరల్ నియోజకవర్గలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు'
నెల్లూరు రూరల్ నియోజకవర్గలోని పలు డివిజన్లలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు... స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే.. కమిషనర్‌తో చర్చించి, డివిజన్ల వారీగా వినతిపత్రాలను అందజేశారు.