DIED: శ్రీపొట్టిశ్రీరాములు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువస్తే.. స్వీపర్, సెక్యూరిటీ గార్డులు చికిత్స చేయడంతో పరిస్థితి విషమించింది. కట్లు కట్టడం అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చిన డ్యూటీ డాక్టర్ శాంత కనీసం పరిశీలించకుండానే.. నెల్లూరుకు తీసుకుపొమ్మని చెప్పారు. ఆ వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన రామకృష్ణారావు (49) అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. రామకృష్ణారావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో.. అక్కడే ఉన్న స్వీపరు, సెక్యూరిటీ గార్డులు వైద్యం మొదలు పెట్టారు. వారే కట్లుకట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన డ్యూటీ డాక్టర్ సరిగా చూడకుండానే పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే నెల్లూరుకు తీసుకువెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు. బంధువులు ఆయనను అత్యవసరంగా నెల్లూరు తరలించడానికి సిద్ధమయ్యారు. సెక్యూరిటీ గార్డులు కట్టిన కట్లు.. బాధితుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించే వరకూ నిలవలేదు. మధ్యలోనే ఊడిపోవడంతో మరోసారి కట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. మృతి చెందారు. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకంవల్లే రామకృష్ణారావు చనిపోయాడని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితుడిని డ్యూటీ డాక్టరు పరిశీలించారని, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే సెక్యూరిటీ సిబ్బంది సహాయం తీసుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి చెప్పారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతోపాటు ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశామని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) రమేశ్‌నాథ్ తెలిపారు.
సమగ్ర విచారణ జరపండి: మంత్రి రజని
ఆత్మకూరు ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పందించారు. వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఏపీవీవీపీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కమిటీని నియమించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్పష్టంచేశారు. వైద్యులనిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
లోకేష్ ధ్వజం.. జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా అని మండిపడ్డారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రజారోగ్య దేవుడు అని ప్రచారం చేసుకుంటుంటే.. వాస్తవానికి ఆయన ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు. కక్ష సాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని విమర్శించారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. రోజురోజుకీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని మండిపడ్డారు.
-
జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు..వాస్తవమేమో ప్రజల పాలిట యముడు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు..వాస్తవమేమో ప్రజల పాలిట యముడు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 11, 2022జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు..వాస్తవమేమో ప్రజల పాలిట యముడు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 11, 2022
ఇవీ చదవండి: CBN TOUR: నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన