ETV Bharat / state

అతడి కన్ను పడిందా.. ఆ ఇంటికి ఇక కన్నమే..! - వంద చోరీలకు పాల్పడ్డ నిందితుడు అరెస్ట్​

Hundred thefts accused arrested in nellore: అతను పద్నాలుగేళ్లుగా చోరీలే వృత్తిగా ఎంచుకున్నాడు. తాళం వేసిన భవంతులు కనిపిస్తే వదలడు. గురి పెట్టాడంటే చోరీ చేయాల్సిందే. పోలీసులు పట్టుకోకూడదని చరవాణి సైతం వినియోగించడు. ఇప్పటిదాకా ఆరు జిల్లాల్లో వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైౖలుకెళ్లడం.. తిరిగి రావడం ఇలా చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి కొనసాగిస్తున్నాడు. ఇలా ఇతర జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడు. చివరకు నెల్లూరు జిల్లా కావలి పోలీసులకు చిక్కాడు.

Kavali police arrested 100 theft cases Accused
Thief Case in nellore
author img

By

Published : Dec 18, 2021, 1:26 PM IST

Updated : Dec 18, 2021, 5:17 PM IST

Kavali police arrested more than 100 theft cases Accused: పద్నాలుగేళ్లుగా చోరీలే వృత్తిగా ఎంచుకొని.. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నెల్లూరు జిల్లా కావలి పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడికి సంబంధించిన వివరాలను కావలి డీఎస్పీ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.

విశాఖ నగరంలోని గాజువాకకు చెందిన బోలా నాగసాయి(30)ని కావలి గ్రామీణ సీఐ షేక్‌ ఖాజావలి అరెస్టు చేశారు. ముసునూరు వద్ద ఉన్నాడన్న పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 184 గామ్రుల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నగదు అతను విలాసాలకు వినియోగించాడు.

జైౖలుకెళ్లడం.. తిరిగొచ్చి మళ్లీ..
జులైలో జైలు నుంచి విడుదలైన తరువాత కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలో రెండు గృహాల్లో, ఒకటో పట్టణ పరిధిలో రెండు, నెల్లూరులో 8 ఇళ్లల్లో చోరీలు చేశాడని వివరించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో కూడా పలు చోరీలకు పాల్పడ్డాడు. ఇలా మొత్తం వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావు, సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్‌ అభినందించారు.

ఇదీ చదవండి..

Shops Close For CM Tour: తణుకులో సీఎం పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు

Last Updated : Dec 18, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.