ETV Bharat / state

ఇస్రో జైత్రయాత్ర.... పీఎస్​ఎల్వీ-సీ 46 ప్రయోగం విజయవంతం

ఇస్రో తన విజయపరంపరను కొనసాగిస్తోంది. అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం రీశాట్-2 బీఆర్1ను.. పీఎస్​ఎల్వీ-సీ 46ను వాహక నౌక విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

author img

By

Published : May 22, 2019, 6:19 AM IST

Updated : May 22, 2019, 6:40 AM IST

నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్
దిగ్విజయం

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి భారతదేశ ప్రతిష్టను మరోసారి ప్రపంచదేశాలకు చాటింది. ఉదయం 5.30 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది. వాహక నౌకను శ్రీహరికోట నుంచి నింగిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగం ఇది. 615 కిలోల బరువున్న రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహాన్నిరాకెట్ మోసుకెళ్లింది. 557 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని వాహక నౌక ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం విడిపోయింది.

ముచ్చటగా మూడోసారి

రాడార్ ఇమేజింట్‌ శాటిలైట్లలో ఆర్‌.ఐ శాట్‌ 2బీ మూడవది మొదటగా 2009లో ఆర్.ఐ శాట్‌ను ప్రయోగించారు. ఆతర్వాత 2012లో ఆర్‌.ఐ.శాట్‌ 1 ప్రయోగం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన.... ఆర్‌.ఐ శాట్‌ 2బీ ఐదేళ్లపాటు సేవలు అందించనుంది. వ్యవసాయంలో మార్పులు,అడవుల సంరక్షణ, వాతావరణంలో మార్పులతోపాటు తుపానుల వంటి విపత్తులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆర్‌.ఐ.శాట్‌ 2బీ అందించనుంది. కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటి నుంచే ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించనుంది.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమైన గరుడవాహన ఉత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం శ్రీవారు గరుడవాహనంపై ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలతో తిరు వీధుల్లో విహరించారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం రాత్రి ఉభయ దేవేరులతో స్వామి వారికి కల్యాణోత్సవం కమనీయంగా జరిపారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuramu (D)
date : 21-05-2019
sluge : ap_atp_72_21_garudavahana_seeva_kalyanotsavam_av_c13
Last Updated : May 22, 2019, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.