ETV Bharat / state

Rains in Nellore district: నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు.. సోమశిల జలాశయానికి భారీ వరద - నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు

author img

By

Published : Nov 29, 2021, 12:06 PM IST

Updated : Nov 29, 2021, 4:00 PM IST

నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు

Heavy rains in nellore district: నెల్లూరు జిల్లా ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, పెన్నా వరదతో ఆత్మకూరు చెరువును తలపిస్తోంది. ఇళ్లు నీటమునగడంతో.. ప్రజలు తీవ్ర అపస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతలలో ఉన్న గిరిజనుల పరిస్దితి మరి దారుణంగా ఉంది. ఎడతెరిపి ‌లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారింది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరు, పాతపాడు చెరువులకు గండ్లు పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు.

నగరంలోని కొండాయపాలెం గేట్, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, పొదలకూరు రోడ్డు, వీఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ, పొగతోట, సుబేదారుపేట ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు జోరుగా ప్రవహిస్తోంది. అసలే అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్​ ఫ్లో 96 వేల క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 1,16 క్యూసెక్కులు ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీ వరదల దృష్ట్యా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కలువాయి చెరువు అలుగు పోస్తుంది. పంట పొలాల్లో వరద నీరు ప్రవాహిస్తోంది. వరి నారుమళ్లు, సంపంగి పూల తోటలు నీట మునిగాయి.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది..

నెల్లూరు జిల్లా నాయుడుపేటను ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎక్కువగా రావడంతో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నది ఒకవైపు బ్రిడ్జిపై నీరు పారడంతో నీటిలోనే వాహనాలు వెళ్తున్నాయి. పెళ్లకూరు మండలంలోని గ్రామాల్లో ప్రవహించే వాగు నీరు... పొలాల్లోకి పారుతోంది.

చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

జిల్లాలోని ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో.. వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఆత్మకూరు ఎస్.టీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరటంతో.. వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సంగం, చెజర్ల, అనంతసాగరం, ఏ.యస్.పేట మండలాల్లో వాగులు పొంగి పొర్లుతుండటంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏయస్.పేట మండలం గుడిపాడు వద్ద.. వాగులో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంతో కోట్టుకుపోతుండటంతో స్థానికులు కాపాడారు. వరి నార్లు వెసిన పంట పొలాలు.. చెరువులను తలపిస్తున్నాయి. పత్తిచేలలో భారిగా నీరు వచ్చి చేరింది.

రాకపోకలకు అంతరాయం..

గూడూరు-మనుబోలు మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇంజినీరింగు కళాశాల వద్ద వాగు ప్రవాహించడంతో వాహనాలు ప్రయాణించలేని పరిస్థితిలో ఉన్నాయి. వాగు వద్ద పరిస్థితిని ఎస్పీ విజయారావు, అధికారులు సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

DOLLAR SHESHADRI DIED: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

Last Updated : Nov 29, 2021, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.