ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

author img

By

Published : Apr 4, 2021, 2:10 PM IST

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు బయటికి వెళ్లాలంటనే ప్రజలు జంకుతున్నారు. రాత్రిళ్లూ ఉక్కపోతతో సతమతమవుతున్నారు.

summer
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఏప్రిల్‌లోనే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోంది. ఎండల తీవ్రతకి ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ కోస్తాలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. 2018 - 20 మధ్య పరిశీలిస్తే ఎండల తీవ్రత 3.7 డిగ్రీల అధికంగా నమోదయ్యాయి. రాయలసీమలోనూ 1.2 డిగ్రీలు పెరిగింది. ఇప్పుడు రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9.4 డిగ్రీల వరకు అత్యధికంగా ఉంటున్నాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు 43 డిగ్రీలకు తగ్గటం లేదు. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది ఎండల తీవ్రగా బాగా పెరిగింది. బాపట్లలో 5.5 ఒంగోలులో 5.2 అమరావతి నెల్లూరులో 4.3 విజయవాడలో 4.1 తిరుపతిలో 3.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది మే నాటికి పలు మండలాల్లో 43 డిగ్రీల నుంచి 47.8 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికే ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలకు చేరింది.

నెల్లూరు జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజూవారి పనులు చేసుకునే కూలీలు.. ఎండ తీవ్రతకి అల్లాడిపోతున్నారు. ఏసీలకు గిరాకీ పెరిగిందని దుకాణాలు యజమానాలు చెబుతున్నారు.

మార్చి 31న బాపట్లలో సాధారణ ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీలు నమోదు కావాల్సి ఉంటే 40.5 డిగ్రీలు నమోదైంది. అంటే 7.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఏప్రిల్‌ 2న 9.4 డిగ్రీలకు పెరిగింది. తునిలో 6.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. విజయవాడలో ఆరు డిగ్రీలు పెరిగింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 8 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తుల పాటించాలని చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. మహిళా స్వయం ఉపాధికి సాయంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.