ETV Bharat / state

నాడు కళకళ.. నేడు నిర్లక్ష్యంతో వెలవెల - tdp

సొంతింటి కల నెరవేరబోతుందంటూ ఆశపడ్డారు...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తుంటే ఆనందపడ్డారు. అట్టహాసంగా గృహప్రవేశాలు చేసుకున్నా...చిన్నచిన్న సమస్యల కారణంగా ఇళ్లల్లోకి చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా... అద్దంలా మెరిసిపోయేలా నిర్మించిన కాలనీ కళావిహీనంగా తయారైంది. నెల్లూరులో పేదల కోసం నిర్మించిన గృహసముదాయం ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక కథనం.

houses
author img

By

Published : Jul 14, 2019, 7:03 AM IST

సొంతింటి కల సాకారం కోసం ఎదురుచూపులు

నెల్లూరు వెంకటేశ్వరనగరలో షీర్ వాల్ టెక్నాలజీతో అత్యాధునికంగా నిర్మించిన పేదల గృహాలు లబ్ధిదారులను ఊరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పురపాలక మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఇళ్లను శరవేగంగా నిర్మించారు. విశాలమైన రహదారులు, పార్కులతో రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. లబ్దిదారుల ఎంపిక, గృహప్రవేశాలు సైతం పూర్తిచేసుకున్నా...విద్యుత్, నీటి సౌకర్యం వంటి పనులు మిగిలిపోయిన పరిస్థితుల్లో.. ప్రజలు ఇళ్లలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా... పట్టించుకునే వారు ఎవరూ లేక గృహాలు పాడైపోతున్నాయి.

కళావిహీనంగా.. తాగుబోతులకు అడ్డాగా...

3 నెలల క్రితం వరకు పచ్చదనంతో కళకళలాడిన ప్రాంతం... అప్పుడే వెలవెలబోతోంది. నీరులేక చెట్లు ఎండిపోతున్నాయి. ఇళ్లల్లోని గోడలకు బూజుపట్టి అపరిశుభ్రంగా తయారయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోతుండగా.... రోడ్లు, పార్కులు అపరిశుభ్రంగా మారాయి. తాగుబోతులు, ఆకతాయిలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది.

వసతులు కల్పన పూర్తి చేస్తేనే..

అత్యాధునిక హంగులతో 4వేల 800 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసినా....తుది దశ పనుల్లో నిర్లక్ష్యంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే సొంతింటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. వీలైంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. పచ్చదనంతో కళకళలాడిన కాలనీ కళ్లముందే పాడైపోతుండటంపై లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

Intro:Ap_Vja_11_12_Erukala_Sangam_Shabha_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్: విజయవాడ నగర పరిధిలోని పాయకాపురం ప్రధాన కూడలిలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ఎరుకుల సామాజిక వర్గానికి త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఎరుకల సామాజికవర్గానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ఎరుకుల సామాజిక వర్గ ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని బాధ్యతాయుతంగా చదివించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేరు నాని కోరారు..
బైట్ : పేర్ని నాని _ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి..

Body:Ap_Vja_11_12_Erukala_Sangam_Shabha_av_Ap10052

Conclusion:Ap_Vja_11_12_Erukala_Sangam_Shabha_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.