ETV Bharat / state

GAS LEAK: గ్యాస్‌ లీకై.. కార్మికులకు అస్వస్థత - ap latest news

GAS LEAK: ఓ కర్మాగారంలో గ్యాస్‌ లీకై బిహార్‌కు చెందిన కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌ సమీపంలోని బావిలో దిగిన వ్యక్తి.. గ్యాస్‌ పరిశీలిస్తుండగా లీకైంది. అతడిని కాపాడేందుకు మరో నలుగురు చొరవ తీసుకోగా.. ఆ క్రమంలో వారూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

GAS LEAK
GAS LEAK
author img

By

Published : Jul 1, 2022, 10:11 AM IST

GAS LEAK: పంటపాలెం పంచాయతీలోని ఓ కర్మాగారంలో గురువారం గ్యాస్‌ లీకై బిహార్‌కు చెందిన కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌ సమీపంలోని బావిలో దిగిన వ్యక్తి.. గ్యాస్‌ పరిశీలిస్తుండగా లీకైంది. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని కాపాడేందుకు మరో నలుగురు చొరవ తీసుకోగా.. ఆ క్రమంలో వారూ అస్వస్థతకు గురయ్యారు. అయిదుగురు బాధితులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. సంఘటనపై విచారణ చేస్తున్నామని.. ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.