నెల్లూరు జిల్లాలో బుధవారం ఐదుగురు మంత్రులు పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వెంకటాచలం మండలం జాతీయ రహదారిపై జల జీవన్ మిషన్‌కు సంబంధించిన పైలాన్ ఆవిష్కరించారు. సర్వేపల్లి గ్రామంలో రూర్బన్ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు.
పూడిపర్తిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలు, నాయుడుపేటలో ప్రభుత్వ వైద్యశాల భవనాలను ప్రారంభించారు. సర్వేపల్లిలో వైకాపా శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ