నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దిగువన ఐదుగురు మత్య్యకారులున్న తెప్ప బోల్తాపడింది. వీరందరూ చేపల వేటకు వెళ్లగా.. గరిక శ్రీను (40) అనే మత్స్యకారుడు మృతిచెందాడు. నలుగురు జాలర్లు సురక్షితంగా ఈదుకుంటూ బయటకు వచ్చారు. సోమశిల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో జలాశయం పూర్తిగా నిండిపోయింది. నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వేట నిషేధం ఉన్నా మత్స్యకారులు అక్కడికి వెళుతున్నా... అధికారులు పట్టించుకోవట్లేదు. కింద భాగంలో ప్రవాహం ఎక్కువ ఉండటంతో..ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి. రేపే విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం