నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు సినీ నటుడు సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను... నెల్లూరుకు చెందిన సోనూసూద్ మిత్ర బృందం ఆస్పత్రి అధికారులకు అప్పగించారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను తీసుకువచ్చిన ప్రత్యేక వాహనానికి... ఆత్మకూరు ఆర్డీఓ చరిత్ర వర్షిణి, జిల్లా వైద్యశాల అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరోనా రోగుల ఇబ్బందులు తీర్చేందుకు...
జిల్లాలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న సమయంలో... ఆక్సిజన్ అందక కొవిడ్ బాధితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నెల్లూరుకు చెందిన సోనూసూద్ మిత్రుడు సమీర్‌ఖాన్ తెలిపారు. వీరి అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లు అందించాలని సోనూసూద్‌ను కోరామన్నారు. తమ అభ్యర్థనను మన్నించిన సోనూసూద్... జిల్లా ప్రజల కోసం ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ నే పంపించారని సమీర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.
అధికారుల కృతజ్ఞతలు...
సోనూసూద్ దాతృత్వం చేసిన ఆక్సిజన్ ప్లాంట్... జిల్లాకు చేరుకోవడానికి కలెక్టర్ చక్రధర్ బాబు, మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు ఎంతో కృషి చేశారని సమీర్‌ఖాన్ తెలిపారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు ప్రాణవాయువు ప్లాంట్ అందించినందుకు సోనూసూద్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి కృతక్షతలు చెప్పారు. అనంతరం రియల్ హీరో సోనూసూద్... అధికారులు, వైద్య సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు.
ఇదీ చదవండి: