నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన వాసు... ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలో ఆర్టీఓ వాహనానికి డ్రైవర్గా పనిచేసిన అనుభవంతో వాసు నకిలీ ఆర్టీఓ అవతారం ఎత్తాడు. చేజర్ల మండలంలో వాహనాలను ఆపి ఆర్టీఓ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ పాఠశాల వాహనాన్ని ఆపి... డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. వారు ప్రతిఘటించడంతో వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... నకిలీ ఆర్టీఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీచదవండి.