నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో నకిలీ కోడిగుడ్లు.. కలకలం సృష్టిస్తున్నాయి. వరికుంటపాడుకు సమీపంలోని ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి..... ఆటోలో అమ్మకానికి కోడిగుడ్లు తెచ్చాడు. 30 కోడిగుడ్లు రూ. 130 రూపాయలు అని చెప్పడంతో.. స్థానికులు కొనుగోలు చేశారు. అయితే ఇవి ఎంత సెపటికీ ఉడకకపోవడంతో..మోసపోయామని గ్రహించారు. ఈ గుడ్లలోనూ తేడాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
గుడ్డుపైన ఉన్న పెంకు ప్లాస్టిక్ పదార్ధంలా ఉందని అంటున్నారు. గుడ్డు లోపల ఉన్న తెల్లసొన కూడా తేడాగా ఉండటంతో... ఇవి నకిలీ కోడిగుడ్లని చెబుతున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ కోడిగుడ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై దృష్టిపెట్టారు.
ఇదీ చూడండి.
Aashadha saare: ఈ ఆషాఢ సారె కావిళ్లు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే!