ETV Bharat / state

తనిఖీలో గుప్పుమంది! - ఆత్మకూరు మద్యం దుకాణాల్లో అధికారుల తనిఖీ

కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి22న జనతా కర్ఫ్యూ , ఆ తర్వాత లాక్​డౌన్​ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 46బార్లు, 280 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేయడంతో ఎక్సైజ్​ అధికారులు ఆయా దుకాణాలను సీజ్​ చేశారు. అయితే...​ కొందరు అక్రమార్కులు మాత్రం అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న​ అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

Excise officers  rides at aatmakur
తనిఖీలో గుప్పుమంది!
author img

By

Published : Apr 27, 2020, 11:23 AM IST

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేదీ నుంచి జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈక్రమంలో జిల్లాలోని 46 బార్లు, 280 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసి వేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఎక్సైజ్‌ అధికారులు వారి స్టేషన్ల పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలకు సీళ్లు వేశారు. దాంతో మద్యం సీసాల అమ్మకానికి బ్రేక్‌ పడింది. దొడ్డిదారిన జిల్లాలో 150 రూపాయల క్వార్టర్‌ సీసా ధర రూ.500 నుంచి రూ.1500 వరకు, ఫుల్‌ సీసాను రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయించారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారుల అండతో మద్యాన్ని బ్లాకులో విక్రయించేందుకు తరలిస్తుండగా స్థానికుల చొరవతో పట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్లు, దుకాణాలు మూత వేసినా బ్లాక్‌ మార్కెట్‌లో మద్యం ఎలా అందుబాటులోకి వస్తోందనే అంశంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల బార్లు, మద్యం దుకాణాల్లోని నిల్వల వివరాలను పరిశీలించాలని స్వయంగా ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రీన్‌ జోన్‌లోని ఆత్మకూరు, సూళ్లూరుపేటలోని రెండు బార్లను పరిశీలించాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రాధయ్యను జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశించారు. దాంతో ఎక్సైజ్‌ పోలీసులు ఆత్మకూరు బారును పరిశీలించారు. వారి తనిఖీలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మధ్యవర్తి నివేదిక చూస్తే.. నివ్వెరపోవాల్సిందే..

ఆత్మకూరు బారులో గత నెల 21వ తేదీ ఉదయం ప్రారంభ నిల్వ నమోదు చేశారేగానీ, రాత్రి అమ్మకాలు పూర్తయ్యాక ముగింపు నిల్వలు నమోదు చేయలేదని అధికారులు సమర్పించిన మధ్యవర్తి నివేదికలో పేర్కొన్నారు. ఈ నిబంధన ఉల్లంఘనపై కేసు కూడా నమోదైంది. మధ్యవర్తి నివేదిక ప్రకారం గత నెల 21వ తేదీ ముందు రోజు వరకు ఆ బారులో సగటున 450 క్వార్టర్‌ బాటిళ్లు అమ్ముడుపోతుండగా.. లాక్‌డౌన్‌ ముందు రోజు మాత్రం 1000కి పైగా విక్రయించినట్లు లెక్కలు చూపడంతో అధికారులు విస్తుపోయారు. ఇదేమని బారు నిర్వాహకులను ప్రశ్నించగా.. లాక్‌డౌన్‌ ముందు రోజు పట్టణంలోని మిగతా మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు ముందుగానే మూతపడటంతో తమ బారుకు మద్యం ప్రియులు పోటెత్తారని, రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగాయని తెలిపారు. బారులో అక్కడే కూర్చొని మద్యం తాగేందుకు అనుమతిస్తారు. మూడు గంటల వ్యవధిలోనే 650 మంది మద్యం తాగే అవకాశాలు లేవని తెలుస్తున్నా.. పరిశీలన అధికారులు ఈ అంశాన్ని నివేదికలో పొందుపరచలేదు. బార్ల నుంచి మద్యం పార్శిల్‌ విక్రయాలకు అనుమతి లేకున్నా.. మరి అదనపు అమ్మకాలు ఎలా సాగాయని పరిశీలించిన దాఖలాల్లేవు. బారుకు ముందూ, వెనక సీళ్లు వేశామని చెబుతున్నారే తప్ఫా. ఒక్కరోజు 650 క్వార్టర్‌ సీసాలు అదనంగా ఎలా విక్రయించారనే దానిపై ఎలాంటి స్పష్టత అధికారులు ఇవ్వలేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

* సూళ్లూరుపేట బారు పరిశీలనలో మాత్రం ఎలాంటి అదనపు అమ్మకాలు లేవని, ప్రారంభ, ముగింపు నిల్వలు రెండూ బారు యజమాని ముందుగానే ఆ ప్రాంత సీఐకి అందజేశారని అధికారులు చెబుతున్నారు.

* రెండు బార్ల పరిశీలన వ్యవహారాన్ని ఎక్సైజ్‌ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆత్మకూరులో ఆశాఖ అధికారులు మీడియాకు కొద్దిమేర వివరాలు వెల్లడించినా.. వాటిపై స్పష్టత లేదు. జిల్లాలో మిగతా 44 బార్లు రెడ్‌జోన్లో ఉన్నాయి. వీటిని అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. ఆత్మకూరు బారు తరహాలోనే అన్ని చోట్లా తనిఖీలు సాగుతాయా అనేది శాఖాపరంగా చర్చనీయాంశంగా మారింది.

బారుపై కేసు నమోదు

జిల్లాలోని ఆత్మకూరు, సూళ్లూరుపేటలోని రెండు బార్లను పూర్తిస్థాయిలో పరిశీలించాం. అక్రమ అమ్మకాలు జరగలేదు. ఆత్మకూరు బారులో ప్రారంభ నిల్వ నమోదు చేశారేగానీ.. ముగింపు నిల్వ లేకపోవడంపై కేసు నమోదు చేశాం. అక్కడ జరిగిన అదనపు అమ్మకాలు లాక్‌డౌన్‌ ముందు రోజు కావడంతోనే జరిగిందనేది మా పరిశీలనలో గుర్తించాం. సూళ్లూరుపేటలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. స్థానిక సీఐ బారు నుంచి ముందుగానే నిల్వల వివరాలు తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.