నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆడియో టేపులు సంచలనంగా మారాయి. 7 నెలల ముందు జీజీహెచ్‌లోని హౌస్ సర్జన్‌ను.. వెద్యాధికారి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడంతో ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణ చేయాలని కమిటీలు నియమించారు.
ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో కమిటీలు విచారణ చేపట్టాయి. ఈ రోజు ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నాయి. ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇద్దరు బాధితులను కమిటీ సభ్యులు విచారించారు. నేరం రుజువైతే అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
బదిలీ వేటు...
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం వేటు వేసింది. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్.. వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల విచారణ నివేదిక ఇంకా రానందున సర్కార్ తాత్కాలిక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ప్రభాకర్‌ను తొలుత తిరుపతి రుయాకు బదిలీ చేసిన ఉన్నతాధికారులు.. అనంతరం కర్నూలు జీజీహెచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు