Nellore SP Vijay Rao on Kandukuru Incident: కందుకూరు తెదేపా సభలో జరిగిన దుర్ఘటనపై కేసు నమోదు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఇద్దరు కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. పోలీసుల వైపునుంచి తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అనుమతించిన ప్రాంతంలో కాకుండా మరోచోటకు ప్రచార రథం వెల్లడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇరుకు రోడ్డులో జనం పెద్దసంఖ్యలో చేరటంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. అందువల్లే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
గాయపడ్డ పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదుతో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. న్యాయ సలహా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ షో లో నిబంధనలు ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటామన్నారు.
'ఎన్టీఆర్ కూడలి వద్ద అన్ని ఎర్పాట్లు చేశాం. ఇప్పగుంట కుడలి వద్ద చిన్న ప్రదేశంలో ఆగడం వల్లే ప్రమాదం జరిగింది. మేము ముందుగా సిద్ధం చేసిన ప్రదేశంలో కాకుండా వేరే చోటుకు కదలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు రాగానే ఆయనను చూడటానికి జనం ఒక్కసారిగా వచ్చారు. కార్యక్రమం కోసం పోలీసులను కేటాయించడంలో మా వైపునుంచి తప్పు లేదు'-. త్రివిక్రమ వర్మ,డీఐజీ
ఇవీ చదవండి