ETV Bharat / state

కోవూరులో అధికారులతో కలెక్టర్​, ఎమ్మెల్యే సమావేశం - kovvuru latest news

కోవూరు తహసీల్దార్​ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, కలెక్టర్​లు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పథకాలపై అధికారులను ఆరా తీశారు. కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సదుపాయాలపై అధికారులను అడిగారు.

colllector mla meeting in kovuru at nellore district
కొవూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్​, ఎమ్మెల్యే
author img

By

Published : May 8, 2020, 1:52 PM IST

నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్​ కార్యాలయంలో కలెక్టర్​తో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లాక్​డౌన్​ అమలవుతున్న తీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఇంటింటికీ సర్వే, కోవూరు ప్రభుత్వం ఆసుపత్రిలోని సదుపాయాలపై అధికారులతో వీరు సమీక్షించారు. 'నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి 12 ఈ.సీ.జీ మిషన్స్, ఆటో యుటిలైజ్డ్ మెషిన్స్ కావాలని అధికారులు కలెక్టర్ కోరగా, వాటిని తక్షణమే మంజూరు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి విద్యా దీవెన పథకం ద్వారా లబ్ది పొందిన విద్యార్థులకు అర్హతా పత్రాలు అందజేశారు.

ఇదీ చదవండి :

తిరుపతిలో జిల్లాస్థాయి టాస్క్​ఫోర్స్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.