నెల్లూరు జిల్లా ఉదయగిరి విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కావలి నుంచి ఉదయగిరి వస్తున్న బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. బస్సు వెనుక వైపు శబ్దం రావటంతో అప్రమత్తమైన డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి బస్సును ఆపాడు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ఉండగా...ఎవరికి గాయాలు కాలేదు. ఊడిన చక్రాన్ని టార్చ్లైట్ల సాయంతో ముళ్లపొదల్లో గుర్తించారు. డిపో మేనేజర్ ప్రతాప్ ఘటనాస్థలికి చేరుకొని..., బస్సుకు మరమ్మతులు చేయించారు. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీచదవండి