BJP fire on YSRCP: రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సర్పంచ్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తుందని విమర్శించారు. కేంద్రం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంటే.. 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం ఇంకా జమ చేయలేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే.. సర్పంచ్లకు ప్రత్యేక శాఖ కేటాయించి.. వారి నిధులు వారే వాడుకునే విధంగా చేస్తామన్నారు.
సర్పంచ్ల నిధులను సీఎం జగన్ వాడుకునే హక్కు లేదని సోము వీర్రాజు అన్నారు. వెంటనే వారి నిధులు విడుదల చేయకపోతే.. సర్పంచ్లతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్తారని సోము వీర్రాజు అన్నారు.
ఇదీ చదవండి: