ETV Bharat / state

BJP Leaders fire on YSRCP leaders నెల రోజులకే కంకర తేలిన సీసీ రోడ్లు..  బీజేపి నేతలు ఫైర్ - janasena news

BJP and janasena Leader fire on Nellore district YSRCP leaders: వైఎస్సార్సీపీ నేతలు గుత్తేదారులతో కుమ్మకై నాసిరకం సీసీ రోడ్లు వేశారని నెల్లూరు నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 35 లక్షల రూపాయలతో వేసిన సిమెంట్‌ రోడ్డు నెల రోజులకే అధ్వానంగా తయారవ్వడంతో పాదాచారులు, వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

BJP Leader
BJP Leader
author img

By

Published : May 25, 2023, 10:26 PM IST

Updated : May 25, 2023, 10:40 PM IST

BJP and janasena Leader fire on Nellore district YSRCP leaders: నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు గుత్తేదారులతో కుమ్మకై నాసిరకం సీసీ రోడ్లు వేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేసిన నెల రోజులకే సిమెంట్ రోడ్డు గుంతలుగా మారి సిమెంటంతా బూడిదలాగా గాలికి లేస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. రూ.35 లక్షలతో వేసిన సిమెంట్‌ రోడ్డు నెల రోజులకే అధ్వానంగా తాయరవ్వడంతో పాదాచారులు, వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించాలని కోరుతున్నారు.

బూడిదతో రోడ్లు వేయొచ్చని వైసీపీ నేతలు నిరూపించారు.. ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా.. గుత్తేదారులతో కుమ్మకై వైఎస్సార్సీపీ నేతలు లక్షల రూపాయలు దోచుకుంటున్నారని.. స్థానిక భారతీయ జనతా పార్టీ నేత శ్రీను ఆరోపించారు. నెల్లూరులోని ప్రధాన వ్యాపార కూడలి పప్పుల వీధిలో కొన్ని నెలల క్రితం వేసిన సీసీ రోడ్డును ఈరోజు బీజేపీ, జనసేన నేతలు కలిసి పరిశీలించారు. అనంతరం రూ. 35 లక్షల రూపాయలతో వేసిన సిమెంట్‌ రోడ్డు నెల రోజులకే అధ్వానంగా తాయరైందని శ్రీను మండిపడ్డారు. బూడిదతోనూ రోడ్లు వేయొచ్చని వైఎస్సార్సీపీ నేతలు నిరూపించారని.. జనసేన నేత సుజిత్ బాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి నాసిరకం రోడ్లు నెల్లూరు నగరంలో అనేకం వేశారని స్థానికులు విమర్శించారు.

గుంతలుగా మారి సిమెంటంతా బూడిదలా లేస్తుంది.. నెల్లూరు నగరంలో నిర్మాణం చేసిన నెల రోజులకే సిమెంట్ రోడ్డులు గుంతలుగా మారి.. సిమెంటంతా బూడిదలా గాలికి లేస్తుందని.. బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా నమ్మకం నువ్వే జగన్' అనే పేరుతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి, శిలాఫలకంపై ప్రచార ముద్రలు వేశారు కానీ, నాణ్యమైన రోడ్లు వేయలేదని మండిపడ్డారు. ఒక్కసారి నిర్మాణం చేపడితే 30 సంవత్సరాలు ఉండాల్సిన సిమెంట్ రోడ్డులు.. నిర్మాణం చేసిన నాలుగు నెలలకే గుంతలుగా మారయన్నారు. నెల్లూరు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి పప్పుల వీధిలో వైఎస్సార్సీపీ నాయకుడు గుత్తేదారుతో కలిసి నిర్మిణించిన రోడ్డును.. జనసేన నేత సుజిత్ బాబు, బీజేపీ నేత శ్రీను పరిశీలించారు.

వైసీపీ నేతలు రూ.లక్షలు దోచుకుంటున్నారు.. వారు మీడియాతో మాట్లాడుతూ..''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. స్టేషన్లకు తీసుకెళ్లే వేధిస్తున్నారని.. కొంతమంది స్థానికులు వారి సమస్యలను చెప్పుకోవటానికి మా దగ్గరకు వచ్చారు. నెల్లూరు ప్రధాన వ్యాపార కూడలి పప్పుల వీధి నుంచి వినాయకుడి గుడి వరకు నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డు పరిస్థితి గురించి మాకు తెలియజేశారు. దీంతో ఈరోజు సీసీ రోడ్డును పరిశీలించగా.. రోడ్డుంతా గుంతలమాయంగా మారింది. చేతితో లాగితే సిమెంట్ బదులు బూడిద పొడిగా బయటకు వస్తుంది. ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా.. గుత్తేదారులతో కుమ్మకై వైఎస్సార్సీపీ నేతలు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.'' అని అన్నారు.

రోడ్డుపై కంకర-పాదాచారులు అవస్థలు.. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరుడు సీసీ రోడ్డు నిర్మాణం కోసం ధరఖాస్తు చేయగా.. సీఎండీఎఫ్ నిధుల నుంచి రూ. 35 లక్షలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. దీంతో 2022 అక్టోబర్‌లో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి.. నెల రోజులకు పనులు మొదలు పెట్టారన్నారు. 2023 మార్చిలో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయగా.. నెల రోజులకే రోడ్డు గుంతలుగా మారిందని పేర్కొన్నారు. సిమెంట్ పొడిగా మారి గాలికి దుమ్ముగా లేచిపోతుందని, రోడ్డుపై కంకర బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఇలాంటి నాసిరకం రోడ్లు నెల్లూరు నగరంలో అనేకం వేశారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో ఇటీవల వేసిన రోడ్లను పరిశీలిస్తే తెలుస్తుంది. నెల రోజులుగా ఈ రోడ్డుపై నడవలేక ఇబ్బందులు పడుతున్నాము. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డును నాసిరకంగా వేశారు. పైకి లేచిన కంకర కాళ్లకు దిగబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలి.'' -నెల్లూరు నగరం స్థానికులు

నెల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు బూడిద రోడ్లు వేశారు..బీజేపీ

ఇవీ చదవండి

Last Updated : May 25, 2023, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.