ETV Bharat / state

balakrishna fans celebrations: "అఖండ" సినిమా విడుదల.. బాలయ్య అభిమానుల సంబరాలు - నెల్లూరులో బాలకృష్ణా అభిమానుల సంబరాలు

balakrishna fans celebrations: నందమూరి బాలకృష్ణ నటించిన "అఖండ" సినిమా విడుదల సందర్భంగా.. నెల్లూరు జిల్లాలో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కటింగ్​ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. "అఖండ" చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

balakrishna fans celebrations on occassion of akhanda movie release
నెల్లూరులో బాలయ్య అభిమానుల సంబరాలు
author img

By

Published : Dec 2, 2021, 12:50 PM IST

balakrishna fans celebrations: తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో "అఖండ" సింహగర్జన కొనసాగుతుండగా.. థియేటర్ల బయట అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సినిమా కావడం.. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన మూడో చిత్రం కావడంతో.. అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో.. ఈ చిత్రాన్ని మొదటి రోజే చూసేయాలని ఫ్యాన్స్ సినిమా టాకీసులకు పోటెత్తారు. ఫలితంగా.. థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది.

బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్​ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. సినిమా హాల్ వద్ద ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు పంపిణీ చేశారు. బాలకృష్ణ అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే "అఖండ" సినిమా వీక్షించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

నాయుడుపేటలో..
జిల్లాలోని నాయుడుపేట సీఎస్ థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో.. సంబరాలు నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేశారు. అఖండ చిత్రం భారీ విజయం సాధించాలని అభిమానులు, తెదేపా నాయకులు కాంక్షించారు.

ఇదీ చదవండి:

Akhanda review: 'అఖండ'గా బాలయ్య అదరగొట్టేశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.