సోమశిల జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11 వేల క్యూసెక్కులుగా ఉంది. సోమశిల గరిష్ఠ నీటినిల్వ 77.988 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74 టీఎంసీలు నీరుంది. సంగం పెన్నా ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నిలిచిన రాకపోకలు..
సంగం వారధిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సోమశిల నుంచి సంగం వారధిపైకి నీరు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంగం వారిధికి ఇరువైపులా గేట్లు మూసివేశారు. పొదలకూరు, చేజర్ల మండలాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: ఆ బామ్మ వయసు 60 కాదండోయ్.. పదహారే!