నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన అన్నదాతలకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందించనున్నట్లు ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శారదా తెలిపారు. తుపానుతో వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు మాత్రమే ఈ రాయితీ అందనుంది. ఎన్ఎల్ఆర్ 34449, ఆర్ఎన్ఆర్ 4900 క్వింటాలు , బిపిటి 5204 రకం 750 క్వింటాళ్లు, 1156 రకం 100 కింటాలు... అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాల కావలసిన కర్షకులు రైతుభరోసా కేంద్రంలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. అన్నదాతలు 20 శాతం డబ్బులు కడితే 80 శాతం రాయితీతో విత్తనాలు అందజేస్తామన్నారు.
ఇదీ చదవండీ...జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్