ETV Bharat / state

AP Sarpanchus: 'మాకు గౌరవ మర్యాదల్లేవ్'.. సీఎం జగన్‌పై సర్పంచులు ఆగ్రహం - AP Sarpanchs today news

AP Sarpanchs Sangam Samavesam updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సర్పంచులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల తమకు తమ గ్రామాల్లో కనీస గౌరవ మర్యాదలు కూడా దక్కడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్పంచుల డిమాండ్లను నేరవేర్చకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ap
ap
author img

By

Published : Apr 20, 2023, 2:03 PM IST

AP Sarpanchs Sangam Samavesam updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై 26 జిల్లాలకు చెందిన గ్రామ పంచాయతీల సర్పంచులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులుగా ఎన్నికైనా రోజు నుంటి నేటి వరకు తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని ఆవేదన చెందారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వల్ల రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన సర్పంచులకు కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదని దుయ్యబట్టారు.

సర్పంచుల నిధులు - విధులు లాగేసుకుంటున్నారు.. పంచాయతీల నిధులు, విధులకు సంబంధించి తాజాగా ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్నీ గ్రామ పంచాయతీల సర్పంచులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు దక్కాల్సిన నిధులను, విధులను లాగేసుకోని.. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేపోయాం.. ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవీపీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సర్పంచులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తున్నా.. గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేపోయామని వాపోయారు. పంచాయతీలకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదని ఆగ్రహించారు.

నిధులను సీఎం జగన మళ్లించారు.. సచివాలయ కన్వీనర్లు గృహసారథులు, గ్రామ వాలంటీర్ల ద్వారా పాలన సాగిస్తున్నప్పుడు.. పంచాయతీ వ్యవస్థ ఎందుకని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన పంచాయతీ నిధులను ముఖ్యమంత్రి జగన్ పక్కదారి పట్టించారని విమర్శించారు. పంచాయతీలకు రావ్వాల్సిన రూ. 8,660 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రానికి 13 అవార్డులు-ఏపీకీ జీరో అవార్డులు.. దేశ రాజధాని దిల్లీలో తాజాగా జరిగిన సమావేశంలో తెలంగాణా రాష్ట్రంలోని పంచాయితీలకు దాదాపు 13 అవార్డులు వస్తే‌, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం వైఎస్సార్సీపీ పనితీరుకు నిదర్శనమని.. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షురాలు లక్ష్మీ మండిపడ్డారు. పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేపడుతామని ఆమె హెచ్చరించారు.

సర్పంచుల కన్నా గ్రామ వాలంటీర్లకే గౌరవ వేతనాలు ఎక్కువ వస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అన్నీ గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రతి నెల రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీలకు అతీతంగా సర్పంచులంతా కలిసి ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.