ETV Bharat / state

CM JAGAN fire on TDP: చంద్రబాబు, పవన్​పై జగన్ విమర్శనాస్త్రాలు.. మంచి జరిగితే వైసీపీకి ఓటేయండి - Nellore District villages news

CM Jagan lashed out at chandrababu and Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయంటూ.. ప్రజలకు హెచ్చరికలు చేసిన జగన్.. చుక్కల భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పిస్తున్నామని ప్రకటించారు.

CM JAGAN
CM JAGAN
author img

By

Published : May 12, 2023, 8:00 PM IST

CM Jagan lashed out at chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తాను ప్రవేశపెట్టిన పథకాలను చూడండి.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయంటూ ప్రజలకు హెచ్చరికలు చేసిన జగన్.. చుక్కల భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పిస్తున్నామని ప్రకటించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై జగన్ విమర్శనాస్త్రాలు

చుక్కల భూమిపై రైతుకు సర్వ హక్కులు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించి.. ఆ భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేశామని, రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి చుక్కల భూములను డీనోటిఫై చేశామని, ఆ భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పిస్తున్నామని, దాదాపు 2,06,171 ఎకరాల భూములకు ఈరోజు నుంచే సంపూర్ణ హక్కులు లభించాయని..సుమారు రూ.20 వేల కోట్ల విలువ చేసే విలువైన భూములకు సంపూర్ణ హక్కును కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

చంద్రబాబు, పవన్‌లపై జగన్ విమర్శలు.. కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ''ఎన్నికలు వస్తున్నాయని.. చంద్రబాబు, పవన్ బాబులు రోడ్డెక్కారు. ప్రజలకు హెచ్చరిస్తున్నా.. వారి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. నా పథకాలను చూడండి. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి. పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే గనక DPT జరుగుతుంది. అంటే.. దోచుకో, పంచుకో, తినుకో.. అనే పద్ధతిలో పాలన జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రైతులను చంద్రబాబు దగా చేశాడు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాం అంటున్న దత్త పుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఆయన ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే ప్యాకేజీ స్టార్ ఒకాయన వచ్చి డైలాగులు చెప్తున్నాడు. వీరిద్దరి మాటలను ప్రజలు నమ్మవద్దు'' అని ఆయన అన్నారు.

ఆయనకు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి.. అనంతరం ఎలక్షన్లు దగ్గరకు రావడంతో ప్రతిపక్షాలు రోడ్లు మీదకు వస్తున్నారని, నాలుగు సంవత్సరాలుగా ఎక్కడికి పోయారని సీఎం జగన్ ప్రశ్నించారు. తాను రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు రూ.2 లక్షల కోట్లకు పైగా బటన్ నొక్కి నిధులు ఇస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని జగన్ పేర్కొన్నారు. గూగుల్, ఫేస్‌బుక్‌లలో వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నా.. పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తామన్నా.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నా.. ప్రతిపక్షాల వాళ్లు కోర్టులకు పోతున్నారని విమర్శించారు.

మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఇంకో 10 నుంచి 15 సంవత్సరాలలో ప్రతి పేదవాడు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని తాను వేడుకుంటున్నానని.. ఈ ప్రభుత్వంలో హయాంలో మీకు మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని కోరుతున్నానన్నారు. బ్రిటిష్ వారి కాలంలో రికార్డుల్లో చుక్కలు పెట్టి వదిలేసిన భూములకు విముక్తి కల్పించి.. ఈరోజు రైతులకు సర్వ హక్కులను కల్పిస్తున్నామన్నారు. 2016లో చంద్రబాబు పుండు మీద కారం చల్లినట్టు చుక్కల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చి.. రైతులకు తీవ్ర అన్యాయం చేశారని జగన్ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.