నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అవి రావడానికి 2- 3 వారాలు సమయం పడుతుందని వివరించింది. కె అనే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్ దీనికి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి.
ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఆనందయ్య ఇచ్చే పి,ఎల్,ఎఫ్ మందులు వాడొచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధం కోసం కొవిడ్ రోగులు వెళ్లొద్దని.. మందు పంపిణీ వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు మందుపంపిణీపై హైకోర్టులో విచారణ జరిగింది. ఔషధం పంపిణీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చుక్కల మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి
ఆనందయ్య మందు.. సీసీఆర్‌ఏఎస్ నివేదికే కీలకం!