కొవిడ్ చికిత్సకు అందించే కంటిచుక్కల మందుకు ఆమోదం ఇచ్చే అంశంపై కేంద్ర ఆయుష్ శాఖ ఆనందయ్యతో జరుపుతున్న చర్చల విషయంలో కొంత పురోగతి ఉందని.. ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టుకు నివేదించారు. నిర్ణయానికి మరికొంత సమయం పడుతుందన్నారు. వ్యాజ్యంపై విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్ కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద సంప్రదాయ మందు పంపిణీ కార్యక్రమం కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు.
ఇదీ చదవండి:
jagan disproportionate assets case: 'జప్తు చేసిన భూములను హెటిరో సంస్థకు అప్పగించండి'