ETV Bharat / state

సజ్జల రామకృష్ణారెడ్డికి అఖిల భారత గంగపుత్ర మహాసభ సన్మానం

author img

By

Published : Oct 29, 2020, 4:26 AM IST

బెస్తల సమస్యలు పరిష్కరించాలని నెల్లూరులో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిలను అఖిల భారత గంగపుత్ర మహాసభ కోరింది. నెల్లూరు ఆర్అండ్​బీ అతిథి గృహంలో అధికారుల సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులను బెస్త కులస్థుల సమస్యలు పరిష్కరించాలని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త కోరారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి అఖిల భారత గంగపుత్ర మహాసభ సన్మానం
సజ్జల రామకృష్ణారెడ్డికి అఖిల భారత గంగపుత్ర మహాసభ సన్మానం

నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త.. సంప్రదాయ మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు.

నెల్లూరుకు డైరెక్టర్ ఇవ్వలేదు..

ఇటీవలే ప్రకటించిన బెస్త కార్పొరేషన్​ డైరెక్టర్ పదవుల్లోనూ నెల్లూరు జిల్లాకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరులో సుమారు 25 నుంచి 30 వేల మంది బెస్త జనాభా ఉందని మంత్రి, సలహాదారులకు వివరించారు.

రాజకీయ అవకాశాలు కల్పించాలి..

రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల బెస్తలు ఉన్నారని.. తమకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని మహాసభ నేతలు సన్మానించారు.

ఇవీ చూడండి : 'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.