ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంతానోత్పత్తి కేంద్రమైన నేల పట్టు పక్షుల కేంద్రం కరోనా అనంతరం తెరుచుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని ఉన్న ఈ కేంద్రం పర్యాటకుల సందర్శనార్థం.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరిచారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శుకులకు పలు రకాల వసతులు కల్పించారు. కరోనా కారణంగా పది నెలల విరామం తర్వాత పక్షుల కేంద్రాన్ని పున:ప్రారంభించారు. గూడబాతులు, తెల్లకంకణాయిలు, నత్తగుల్ల కొంగలు, తెడ్డుముక్కు కొంగలు, చెంచాముక్కు కొంగలు వంటి.. 6 వేలకు పైగా పక్షులు ఇక్కడకు చేరుకున్నాయి. దీంతో కొద్ది కొద్దిగా సందర్శకుల తాకిడి పెరుగుతోంది. పక్షుల కేంద్రానికి వచ్చే వారి కోసం అటవీశాఖ అధికారులు తాగునీరు, మరుగుదొడ్లు, బైనాక్యూలర్ వంటి ఇతర వసతులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి...