ETV Bharat / state

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ దీక్ష

ఆన్​లైన్​ తరగతుల నిర్వహణపై నెల్లూరు జిల్లాలో ఏబీవీపీ దీక్ష చేపట్టింది. ప్రభుత్వం వీటిని నిర్వహించవద్దని చెబుతున్నా అది ప్రకటనలకే పరిమితమవుతోందని ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తరగతులు నిర్వహించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

nellore  district
విద్యారంగం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ దీక్ష
author img

By

Published : Jul 6, 2020, 7:30 AM IST

రాష్ట్రంలో ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు, ఆత్మకూరులో ఏబీవీపీ నిరసన చేపట్టింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు వారి కార్యాలయాల్లో విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులపై ఆన్​లైన్ తరగతుల పేరుతో ఫీజులు చెల్లించాలని, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వం ఆన్​లైన్ తరగతులు నిర్వహించ వద్దని చెబుతున్నా.. అది ప్రకటనలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలు ఇవ్వాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లవరపు అశోక్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను తొలగించకూడదని.. వారిని ఆదుకోవాలని అన్నారు. తొలగించే విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు బనాయించాలని పేర్కొన్నారు.

పెండింగ్లో ఉన్న యూజీ, పీజీ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

అత్తింటి వేధింపులు..ఆపై కరోనా..మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.