ETV Bharat / state

Women Fight: భర్త కోసం ఆరాటం.. సచివాలయం వద్ద మహిళ పోరాటం..! - ap latest news

Illegal Affair: తన భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందంటే.. ఏ ఇల్లాలైనా ఎలా ఊరుకుంటుంది. ఆగ్రహంతో ఊగుతూ.. పరాయి మహిళను నిలదీస్తుంది. అయినా వినకపోతే.. పంతాయితీ చేయిస్తుంది. అది కూడా వర్కవుట్​ కాకపోతే.. లాగి ఒక్కటిస్తుంది. ఇదేదో సినిమాను తలపిస్తున్న కథలా ఉందనుకుంటే మనం పొరబడినట్లే. అచ్చం ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది.

A woman attacked on a village secretariat employee at karatampadu in nellore
మొగుడి కోసం ఆరాటం.. సచివాలయం వద్ద పోరాటం
author img

By

Published : Jan 8, 2022, 7:26 PM IST

గ్రామ సచివాలయం ఉద్యోగినిపై.. మహిళ దాడి

కాపురంలో చిచ్చుపెడుతోందంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామ సచివాలయం ఉద్యోగినిపై.. ఓ మహిళ దాడి చేసింది. ఇదే విషయమై గ్రామ సచివాలయం వద్దకు వెళ్లిన బాధిత మహిళ.. ఉద్యోగినిపై చేయి చేసుకుంది.

జరిగిందిదీ..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు సచివాలయంలో రషీదా అనే మహిళ విధులు నిర్వహిస్తోంది. వింజమూరు మండల కేంద్రంలో నివసించే అబ్దుల్ భాషా (సర్దార్).. అదే గ్రామానికి చెందిన నవ్యభారతి అనే మహిళను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు.

రషీదా.. అబ్దుల్​ భాషాతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో.. నవ్యభారతి పంచాయితీ పెట్టించింది. అయినా.. తీరు మారకపోవటంతో విసుగెత్తిన నవ్యభారతి.. రషీదాను నిలదీసేందుకు తాను పని చేస్తున్న సచివాలయం వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ కాస్త పెద్దదై ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నవ్యభారతి.. రషీదాపై చేయి చేసుకోగా.. సచివాలయ సిబ్బంది వారిని అడ్డుకుని ఆత్మకూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ గొడవ ప్రస్తుతం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది.

ఇదీ చదవండి:

Farmers Agitation at Velugodu: సాగునీరు ఇవ్వాలని వెలుగోడులో రైతుల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.