తాగుడుకి బానిసైన ఓ యువకుడు మద్యం దొరక్క.. పెట్రోల్‌లో శానిటైజర్ కలుపుకొని తాగి మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి జరిగింది. నల్లిపోగు నరేష్ అనే ఆ యువకుడు ఉదయం దాటినా ఇంటి నుంచి బయటకు రాకపోవడంపై అనుమానంతో తల్లిదండ్రులు గమనించగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో... ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను పెట్రోల్‌లో కలుపుకుని తాగినట్లు వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: