నకిలీ స్టాంపులు, జామీను పత్రాలు తయారు చేస్తున్న ముఠాను కావలి ఒకటోపట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి నకిలీ స్టాంపులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ ప్రసాద్ విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని పడారుపల్లి జగ్జీవన్‌రామ్ కాలనీకి చెందిన కాకుమూడి సుబ్బరామయ్య(చిన్న), అక్కుర్తి సుమన్, మందా విద్యాసాగర్, తాటిపర్తి శివ నకిలీ స్టాంపులు, పత్రాలు సృష్టిస్తున్నట్లు... కావలి న్యాయమూర్తి గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రంగంలోకి దిగిన సీఐ రోశయ్య, నకిలీ స్టాంపులు, జామీను పత్రాల తయారీ గుట్టురట్టు చేశారు. ఓ గ్రామంలో కన్నకూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో... తండ్రి అరెస్టయి జైల్లో ఉండగా... ఆయన్ను బెయిలుపై విడుదల చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఆ తండ్రి జామీనుకు నిందితులను ఆశ్రయించారు. ఈ మేరకు వారు జామీన్‌దారులకు నకిలీ ప్రాపర్టీఫారం, స్టాంపులు తయారు చేసి కావలి ఏజేఎం కోర్టులో సమర్పించారు. వీటిని నకిలీవిగా న్యాయమూర్తి గుర్తించడంతో... వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండీ:
విశ్రాంత తహసీల్దార్‌కు ఈడీ షాక్... కోటికి పైగా ఆస్తుల జప్తు..!